కంచిలిలో భారీ చోరీ
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:03 AM
కంచిలి మెయిన్‌రోడ్డులో ఓ రిటైర్డు ఉపాధ్యాయుడి ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి 24 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.
24 తులాల బంగారం, కిలో వెండి దొంగతనం
కంచిలి, జూలై 8(ఆంధ్రజ్యోతి): కంచిలి మెయిన్‌రోడ్డులో ఓ రిటైర్డు ఉపాధ్యాయుడి ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి 24 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలి పిన వివరాల మేరకు... రిటైర్డు ఉపాధ్యాయుడు సింహాద్రి ప్రధాన్ శనివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి విశాఖలోని బంధువల ఇంటి వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి కంచిలి వచ్చి చూసే సరికి ఇంటి ప్రధాన తలుపులు రెరిచి ఉండ డంతో లోపలికి వెళ్లి చూశారు. బీరువాలోని సుమారు 24 తులాల బంగారు, కిలో వెండి వస్తువులు చోరీ జరిగినట్టు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వంగా సోం పేట సీఐ బి.మంగరాజుతోపాటు ఎస్‌ఐ పి.పారినాయిడు ఘటనా స్థలానికి చేరు కుని పరిశీలించారు. పలాస నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. బాధి తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.