Share News

నక్సలిజం అంతంపేరిట దేశంలో నరమేధం

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:49 AM

నక్సలిజం లేని దేశంగా చేస్తామం టూ ప్రధాని నరేంద్రమోదీ మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశంలో నరమేధం సృష్టిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నా రు.

నక్సలిజం అంతంపేరిట దేశంలో నరమేధం
మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

పాతపట్నం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): నక్సలిజం లేని దేశంగా చేస్తామం టూ ప్రధాని నరేంద్రమోదీ మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశంలో నరమేధం సృష్టిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నా రు. పాతపట్నంలో సీపీఐ జిల్లా 25వ మహాసభలను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సెంటైన్‌ స్కూల్‌ కూడలి నుంచి కోర్టు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో నారాయణ మాట్లాడారు. ‘అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మలు. దీర్ఘకాలిక పోరాటాలతో సాధించుకున్న హక్కులను బీజేపీ అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తుంది. సంస్కరణల పేరిట దేశ సంపదను కార్పోరేట్లకు కట్టబెడుతుంది. సైద్ధాంతిక విధానాలను మంటగొ ల్పుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో కులమతాలు పేరిట ప్రజల మధ్య చిచ్చుపెడుతుంది. నక్సలిజం అణిచివేయడం పేరిట ప్రజాస్వామ్యాన్ని అప హాస్యం చేస్తుంది. ఎండీయూ ఆపరేటర్ల తొలగింపుతో రాష్ట్రంలో 18,500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టులను పూర్తిచేయాలి.’ అని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, నాయకులు చాపర సుందర్‌ లాల్‌, అక్కినేని విమల, సనపల నర్సింహరావు, ఎస్‌.నారాయణస్వామి, లండ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:49 AM