వరదలో కొట్టుకుపోయి తాపీమేస్త్రి మృతి
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:22 AM
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ మొగిలిపాడు గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ సైన గోపాలరావు(45) వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
పలాస, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ మొగిలిపాడు గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ సైన గోపాలరావు(45) వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. గురువారం సాయంత్రం గోపాలరావు తన పంట పొలాలు చూసేందుకు వెళ్లి గుంతలో పడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలో జాతీయ రహదారి కల్వర్టు వద్ద బురదలో గోపాలరావు మృతదేహం లభ్యమైంది. ఈయనకు భార్య సరస్వతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈఘటనపై తమకు సమాచారం అందిందని కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు.