Share News

Martyrs' Memorial : అమరవీరుల స్మారక సభ నిలుపుదల

ABN , Publish Date - May 27 , 2025 | 11:59 PM

Amaraveerula Sabha cancellation పలాస మండలం బొడ్డపాడులో మంగళవారం అమరవీరుల స్మారకసభను నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు. నాటి పాలకుల తీరుకు వ్యతిరేకంగా.. 1969 మే 27న జరిగిన శ్రీకాకుళ సాయుధ పోరాటంలో పంచాది కృష్ణమూర్తి, శృంగవరపు నర్సింహులు, దున్న గోపాలపారావు, బైనపల్లి పాపారావు, నిరంజన్‌ సాహు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

Martyrs' Memorial : అమరవీరుల స్మారక సభ నిలుపుదల
అమరవీరుల స్మారక సభను అడ్డుకున్న పోలీసులు

  • అడ్డుకున్న పోలీసులు

  • ఆందోళన చెందిన ప్రజాసంఘాలు

  • పలాస రూరల్‌, మే 27(ఆంధ్రజ్యోతి): పలాస మండలం బొడ్డపాడులో మంగళవారం అమరవీరుల స్మారకసభను నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు. నాటి పాలకుల తీరుకు వ్యతిరేకంగా.. 1969 మే 27న జరిగిన శ్రీకాకుళ సాయుధ పోరాటంలో పంచాది కృష్ణమూర్తి, శృంగవరపు నర్సింహులు, దున్న గోపాలపారావు, బైనపల్లి పాపారావు, నిరంజన్‌ సాహు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. వారి త్యాగాలకు గుర్తుగా బొడ్డపాడులో 1990లో ప్రజల సహకారంతో అమరవీరుల స్మారక మందిరాన్ని ఏర్పాటు చేశారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. ఏటా మే 27న ఇక్కడ స్మారక సభ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం 36వ స్మారక సభ నిర్వహణకు ప్రజాసంఘాల నేతలు సన్నద్ధం కాగా.. సీఐ సూర్యనారాయణ, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సభ నిర్వహించరాదని తెలిపారు. దీంతో ప్రజాసంఘాల నేతలు, నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేవారు. ఈ విషయమై ఉన్నతాధికారులను సంప్రదించినా ఇదే సమాధానం రావడంతో సభ నిర్వహించలేదు. కాగా.. ఇటీవల ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని ఎన్‌కౌంటర్‌లో జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరవీరుల స్మారక సభ నిర్వహిస్తే.. పర్యావసానాలు మారుతాయనే ఉద్దేశంతో సభను పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది.

Updated Date - May 27 , 2025 | 11:59 PM