Share News

వివాహిత ఆత్మహత్య?

ABN , Publish Date - May 30 , 2025 | 11:48 PM

కొత్తూరు మండలం మహర్తాపురంలో శుక్రవారం వివాహిత నిమ్మక ప్రవల్లిక (26) ఆత్మహత్యకు చేసుకుందని సీఐ సీహెచ్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ అమీర్‌ ఆలీ తెలిపారు.

వివాహిత ఆత్మహత్య?

కొత్తూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం మహర్తాపురంలో శుక్రవారం వివాహిత నిమ్మక ప్రవల్లిక (26) ఆత్మహత్యకు చేసుకుందని సీఐ సీహెచ్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ అమీర్‌ ఆలీ తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నా యి.. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం కేదారపురం గ్రామానికి చెందిన నిమ్మక ప్రవల్లికకు భామిని మండ లం వడ్డంగి గ్రామానికి చెందిన నిమ్మక సురేష్‌ కుమార్‌తో నాలుగున్నరేళ్ల కిందట వివాహమైంది. వీరి మధ్య గతంలో తగాదాలు చోటుచేసు కోవడంతో బత్తిలి, గుమ్మలక్ష్మీపురం పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులున్నాయి. పెద్దలు వారి మధ్య సయోధ్య కుదిర్చారు. బతుకు దెరువు కోసం ప్రైవేటు సెల్‌ టవర్‌ కంపెనీలో పనిచేస్తూ కొత్తూరు మం డలం మహర్తాపురంలో గత ఆరు నెలలుగా అద్దె ఇంటిలో నివసిస్తు న్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కాని ప్రవల్లిక శుక్రవారం ఇంటి లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. మృతురాలి భర్త సురేష్‌ కుమార్‌ సమాచారంతో సీఐ సీహెచ్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ అమీర్‌ ఆలీ ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీశారు. ప్రవల్లిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవంటూ ప్రవల్లిక మృతిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. క్లూస్‌ టీమ్‌ను రప్పిస్తున్నట్లు తెలిపారు.

అస్వస్థతకు గురై.. ఉపాధి కూలి మృతి

సరుబుజ్జిలి, మే 30(ఆంధ్రజ్యోతి): నందికొండ గ్రామానికి చెందిన ఉపాధి కూలి కొంచాడ రామారావు(49) అస్వస్థతకు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలాగే శుక్రవారం కూడా గ్రామ ఎగువున ఉన్న కొండ ప్రాంతంలో జరుగు తున్న ఉపాధి పనులకు రామారావు వెళ్లాడు. ఈ క్రమంలో గంట తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై పనిచేస్తున్న ప్రాంతం లోనే కుప్పకూలిపోయాడు. తోటి ఉపాధి వేతన దారులు సపర్యలు చేసిన ప్పటికీ ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఏపీవో బి.పార్వతి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రామారావు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు సరుబుజ్జిలి హెడ్‌ కానిస్టేబుల్‌ టి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పెళ్లికాని కుమార్తెలు ఉన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:48 PM