Share News

కల్యాణం... కమనీయం

ABN , Publish Date - May 16 , 2025 | 11:48 PM

పట్టణంలో నిర్వహిస్తున్న వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి సూర్యప్రభ వాహనంలో తిరువీధి నిర్వహించారు.

కల్యాణం... కమనీయం
వేంకటేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం నిర్వహిస్తున్న రుత్వికులు

నరసన్నపేట, మే 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో నిర్వహిస్తున్న వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి సూర్యప్రభ వాహనంలో తిరువీధి నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహాత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి, ధ్వజావరోహణం, పండిత సత్కారం చేపట్టారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్టు నిర్వాహకులు తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దంపతులు పాల్గొన్నారు. జోస్యుల జగన్నాథశర్మ, మావుడూరు జగదీష్‌బాబు, చామర్తి సత్యసాయి కృష్ణమాచార్యులు, జోస్యుల సుందరి వేణుగోపాలశర్మ, చామర్తి శ్రీనివాసచార్యులు, రేజేటి శ్రీరామచార్యులు, అప్పలచార్యులు ఈ క్రతువు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం పుష్ఫయాగం నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

Updated Date - May 16 , 2025 | 11:48 PM