వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:00 AM
వీరభద్రాపురం పంచాయతీ తమలా పురం గ్రామానికి చెందిన వివాహిత కదంబాల శిల్పాచౌదరి(24) ఆత్మహత్య చే సుకుంది.
నందిగాం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): వీరభద్రాపురం పంచాయతీ తమలా పురం గ్రామానికి చెందిన వివాహిత కదంబాల శిల్పాచౌదరి(24) ఆత్మహత్య చే సుకుంది. దీనికి భర్త వేధింపులే కారణమని శిల్ప తల్లి పాండవ లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం దేవుపురం గ్రామానికి చెందిన శిల్పను తమలాపురం గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో వివాహమైంది. రాజ్‌కుమార్ వేధింపులు తాళలేక బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం తల్లి లక్ష్మి, బంధువులు గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేయగా టెక్కలి రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. శిల్పాకు ఇద్దరు కుమారులు ఉన్నారు.