ట్రావెలర్స్‌కు ఆశ చూపి గంజాయి రవాణా
ABN , Publish Date - May 31 , 2025 | 11:30 PM
ఒడిశా నుంచి ట్రావెలర్స్‌ను ఎంచుకొని గంజాయిని జిల్లా మీదుగా తరలిస్తున్న ఇద్దరిని మడపాం టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేసినట్లు ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలు ప్రక టించారు.
మడపాం వద్ద ఇద్దరి అరెస్టు : ఏఎస్పీ శ్రీనివాసరావు
నరసన్నపేట, మే 31(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి ట్రావెలర్స్‌ను ఎంచుకొని గంజాయిని జిల్లా మీదుగా తరలిస్తున్న ఇద్దరిని మడపాం టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేసినట్లు ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలు ప్రక టించారు. ఈ మేరకు.. శనివారం ఉదయం మడపాం టోల్‌ప్లాజా వద్ద ఎస్‌ఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక వాహనం నుంచి దిగి బ్యాగ్‌తో పారిపోతున్న పర్లాకిమిడికి చెందిన ముక్తిపరిషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను 13 కిలోల గంజాయిని చెన్నై రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. చెన్నై చేరిన తరువాత ఈ బ్యాగ్ ఎవరికి అప్పగించాలో ఫోన్‌లో తెలపడం జరుగుతుందని, పర్లాకిమిడిలో రాజేష్ గంజాయి అందించినట్లు దర్యాప్తులో తేలిందని ఏఎస్పీ తెలిపారు. అలాగే శనివారం సాయంత్రం మడపాం వద్ద వాహనాలను పరిశీలిస్తున్న సమయంలో మరో వాహనంలో ఒక మహిళ దిగి వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆమె పేరు రత్నకర్ జిన్ని అని, ఆమె కటక్ నుంచి హైదరాబాద్‌కు 10.8 కేజీలు గంజాయి తరలిస్తుం డగా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నా మన్నారు. ఒడిశానుంచి గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ట్రావెలర్స్‌ను అధికంగా డబ్బులు ఆశచూపి రవాణా చేస్తున్నట్లు సమా చారం ఉందన్నారు. గంజాయి రవాణాను అడ్డుకున్న నరసన్నపేట ఎస్‌ఐ దుర్గాప్రసాద్, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో సీఐ ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.