Share News

14 కిలోలతో గంజాయి స్మగ్లర్‌ అరెస్టు

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:14 AM

తమి ళనాడు రాష్ట్రానికి చెం దిన మోరీస్‌ అనే గం జాయి స్మగ్లర్‌ 14కిలల తో శుక్రవారం పట్టుబ డినట్టు రైల్వే ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలి పారు.

14 కిలోలతో గంజాయి స్మగ్లర్‌ అరెస్టు

పలాస, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): తమి ళనాడు రాష్ట్రానికి చెం దిన మోరీస్‌ అనే గం జాయి స్మగ్లర్‌ 14కిలల తో శుక్రవారం పట్టుబ డినట్టు రైల్వే ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలి పారు. రైల్వేస్టేషన్‌ ఫ్లా ట్‌ ఫారం-2లో విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులకు ఎరుపు రంగు బ్యాగుతో అనుమానాస్పదస్థితిలో ప్రయాణికుడు ఒకరు కనిపించారు. ఆయన్ను ప్రశ్నించి బ్యాగ్‌ తనిఖీ చేయగా గంజాయి బయటపడిందన్నారు. నిందితుడు మోరీస్‌ ఒడిశా రాష్ట్రం రాయఘడ కు చెందిన రాహుల్‌ అనే గంజాయి పండించే వ్యక్తివద్ద రూ.71 వేలకు కొనుగోలు చేసుకొని తమిళనాడు తరలిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు ఆయన్ను అ రెస్టు చేసి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈయన్ను విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Sep 27 , 2025 | 12:14 AM