Share News

జిల్లాకు చెందిన పలువురు మృతి

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:05 AM

జిల్లాకు చెందిన పలువురు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు.

 జిల్లాకు చెందిన   పలువురు మృతి

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం: చెన్నాపురం వాసి మృతి

నరసన్నపేట, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన పలువురు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నాపురం గ్రామానికి చెందిన గంగు సోమేశ్వరరావు (28) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా కోదాడలో టైల్స్‌ పనులు చేస్తూ సోమేశ్వరరావు జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పనులు ముగించుకుని ద్విచక్ర వాహనం పై కోదాడ వస్తుండగా కోనాయి గూడెం సమీపంలో టిప్పర్‌ ఢీకొని అక్కడక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్య శ్రావణి లబోదిబో మంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మృతదేహాన్ని చెన్నాపురం తీసుకువచ్చి శనివారం అంత్య క్రియలు నిర్వహించారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చికిత్స పొందుతూ ఆర్టీసీ కండక్టర్‌..

ఆమదాలవలస, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన పురపాలక సంఘం పరిధి 20వ వార్డు వెంగళరావు కాలనీకి చెందిన ఆర్టీసీ కండక్టర్‌ తంజెళ్ల తిరుపతిరావు(62) చికిత్స పొందు తూ శనివారం మృతి చెందినట్టు ఏఎస్‌ఐ సత్య నారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 15వ తేదీన తిరుపతిరావు తన ద్విచక్ర వాహనంపై మార్కెట్‌ నుంచి ఇంటికి వస్తుండగా ఆమదాలవలస ఫ్లై ఓవర్‌ వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ సడన్‌గా బ్రేక్‌ వేయడంతో తిరుపతిరావు బలంగా ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం రాగోలు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందు తూ శనివారం మృతి చెందారు. తిరుపతిరావుకు భార్య కాంతమ్మ, కుమారుడు ఉన్నారు.

రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు..

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వే స్టేషన్‌ పరిధి సుర్లారోడ్డు-ఇచ్ఛాపురం ఆర్‌ఎస్‌ మధ్య శనివారం రైలు కిందపడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్టు పలాస జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. సుమారు 60 ఏళ్ల వయసు ఉంటుందని, పసుపు రంగు లాల్చీ, నీలం రంగు పూలు కలిగిన లుంగీ ధరించి ఉన్నట్టు తెలిపారు. మృతుడి వివరాలు తెలి సినవారు 8985021143 నెంబరులో సంప్రదించాలని కోరారు.

ఉపాధి పనులు చేస్తూ వేతనదారుడు..

సరుబుజ్జిలి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ఇసకల పాలెం గ్రామానికి చెందిన గుజ్జల గన్నెరాజు (67) శనివారం ఉపాధి పనులు చేస్తున్న చోటే మృతి చెందాడు. వేతనదారులతో కలిసి కాలువలో మొక్క లు తొలగిస్తుండగా సొమ్మ సిల్లి ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. తోటి వేతనదారులు సపర్యలు చేసిన ఫలితం లేకపోయింది. టెక్నికల్‌ అసిస్టెంట్‌ లలితమ్మ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీరాములు ఇచ్చిన సమాచారం మేరకు ఏపీవో పార్వతి ఘటనా స్థలానికి చేరు కుని పరిశీలించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా గన్నెరాజుకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:05 AM