పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:21 AM
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పాతపట్నం మండలం పాసిగంగుపేటకు చెందిన గేదల మరళీకృష్ణ అలియస్ మురళి ఆచూకి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
నరసన్నపేట, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పాతపట్నం మండలం పాసిగంగుపేటకు చెందిన గేదల మరళీకృష్ణ అలియస్ మురళి ఆచూకి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు శుక్రవారం సారవకోట మండలంలో అతడి అత్తవారి గ్రామమైన అడ్డపనస గ్రామంలో నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ అనిల్ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. మరళీకృష్ణ 2020లో కర్ణాటక, నరసన్నపేట, పాతపట్నం పోలీసుస్టేషన్‌లో నమోదైన పలు కేసుల్లో నిందితుడు. అతడిని అరెస్టు చేసి ట్రయల్ నడుస్తున్న సమయంలో 2023లో అక్టోబరులో కోర్టులో హాజరుపరిచే సమయంలో పరారయ్యాడు. దీంతో న్యాయాధికారి నాన్‌బెయిల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేశారు. దీంతో గత రెండేళ్లుగా నిందితుడు కనిపించకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మురళీకృష్ణ స్వగ్రామం పాతపట్నం మండలం పాసిగంగుపేట, అలాగే అత్తవారి గ్రామం అడ్డపనసలో సోదాలు చేపట్టారు.