Share News

మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన వ్యక్తికి పదిరోజుల జైలు

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:27 AM

మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన వ్యక్తికి పది రోజులు జైలుశిక్ష విధిస్తూ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కె.శిరామకృష్ణ తీర్పు ఇచ్చినట్టు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.

మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన వ్యక్తికి పదిరోజుల జైలు

శ్రీకాకుళంక్రైం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన వ్యక్తికి పది రోజులు జైలుశిక్ష విధిస్తూ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కె.శిరామకృష్ణ తీర్పు ఇచ్చినట్టు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 11వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో నగరంలోని దమ్మల వీధికి చెందిన పుక్కాల జ్ఞానేశ్వరరావు మద్యం మత్తులో ఎన్టీఆర్‌ కాలనీ, కంపో స్టు కాలనీ ప్రాంతాల్లో పబ్లిక్‌ను ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించాడు. దీనిని గమనించిన శ్రీకాకుళం వన్‌టౌన్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్‌ 294(బి) కింద ఓపెన్‌ డ్రింకింగ్‌ కేసు నమోదు చేశారు. నిందితుడిని శుక్రవారం సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు హాజరుపరచగా.. న్యాయాధికారి కె.శిరా మకృష్ణ జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ మాట్లాడుతూ.. పబ్లిక్‌ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఒకరికి రెండు రోజులు..

శ్రీకాకుళం క్రైం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మద్యం తాగి బైక్‌ నడుపుతున్న వ్యక్తికి రెండు రోజుల జైలుశిక్ష విధిస్తూ రెండో తరగతి మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధి కారి కె.శివరామకృష్ణ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్‌ సీఐ రామారావు తెలిపారు. ఆ వివ రాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం నగరంలోని జబ్బావీధికి చెందిన వారణాసి ప్రశాం త్‌ ఈనెల 20న మద్యం తాగి బైక్‌ నడుపుతూ ఏడు రోడ్ల జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఈ కేసులో నిందితుడ్ని శుక్రవారం రెండో తరగతి మేజిస్ర్టేట్‌ ఎదుట హాజరు పరచగా విచారణ చేసి శిక్ష విధించారని సీఐ తెలిపారు. సీఐ రామారావు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడిపే వారికి జైలుశిక్ష తప్పదని, వాహనచోదకులు వారి భద్రత కోసమే ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

టెక్కలి పరిధిలో ఇద్దరికి జరిమానా..

టెక్కలి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మద్యం తాగి వాహనం నడిపిన కేసుల్లో పట్టుబడిన ఇద్దరికి టెక్కలి ఫ్లస్ట్‌కాస్‌ మెజిస్ట్రేట్‌ యు.మాధురి చెరో పది వేల రూపాయల జరీమానా విధించినట్టు సీఐ ఎ.విజయ్‌కుమార్‌ శుక్రవారం తెలిపా రు. జీడిపేటకు చెందిన పసుపురెడ్డి మహేష్‌, పెద్దసాన గ్రామానికి చెందిన అట్టాడ నాగరాజు మద్యం తాగి వాహనం నడిపి, వాహన తనిఖీల్లో పట్టుబడిన ట్టు తెలిపారు. కోర్టులో హాజరు పరచగా న్యాయాధికారి శిక్ష విధించారన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:27 AM