దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి జైలు
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:20 AM
నివగాం వద్ద రైసుమిల్లులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రాగోలు బాలకృష్ణకి కొత్తూరు కోర్టు న్యాయాధికారి కందికట్ల రాణి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్టు ఎస్‌ఐ ఎండీ అమీర్ ఆలీ తెలిపారు.
కొత్తూరు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): నివగాం వద్ద రైసుమిల్లులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రాగోలు బాలకృష్ణకి కొత్తూరు కోర్టు న్యాయాధికారి కందికట్ల రాణి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్టు ఎస్‌ఐ ఎండీ అమీర్ ఆలీ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. 2020 సంవత్సంలో నివగాంలోని ఓ రైసుమిల్లు తాళాలు విరగొట్టి రూ.20వేలు అపహరించుకుపోయాడు. దీనిపై అప్పటి దోనుబాయి ఎస్‌ఐ ఎండీ అమీరు ఆలీ కేసు నమోదు చేయగా, హిరమం డలం ఎస్‌ఐ కూన గోవిందరావుతో కలిసి దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జిషీట్ దా ఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధించినట్టు ఎస్‌ఐ అ మీర్ ఆలీ తెలిపారు. పీపీ ఎల్.నాగభేషణరావు కేసును వాదించినట్టు తెలిపారు.