మద్యం మత్తులో హల్‌చల్ చేసిన వ్యక్తికి జైలు
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:48 AM
పూటుగా మద్యం తాగి నడిరోడ్డుపై హల్‌చల్ చేసి వ్యక్తికి శ్రీకాకుళం సెకెండ్ క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టు న్యాయాధికారి శివరామకృష్ణ 45 రోజులు జైలుశిక్ష విధించినట్టు ట్రాఫిక్ సీఐ నాగరాజు తెలిపా రు.
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పూటుగా మద్యం తాగి నడిరోడ్డుపై హల్‌చల్ చేసి వ్యక్తికి శ్రీకాకుళం సెకెండ్ క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టు న్యాయాధికారి శివరామకృష్ణ 45 రోజులు జైలుశిక్ష విధించినట్టు ట్రాఫిక్ సీఐ నాగరాజు తెలిపా రు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. సోమవారం నగరంలోని పొట్టి శ్రీరాము లు జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఎస్‌ఐ సోమశేఖర్ వాహనదారులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తుండగా దమ్మలవీధికి చెందిన తిరిమి సాయిరాజు మద్యం తాగి నడి రోడ్డుపై వీరంగం సృష్టించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. దీంతో ఆయనకు డ్రంకెన్‌డ్రైవ్ టెస్ట్ నిర్వహించి కేసు నమోదు చేసి కోర్టుకు తర లించారు. విచారణ అనంతరం సాయిరాజుకు 45 రోజులు జైలుశిక్ష విధించారు.