మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వ్యక్తికి జైలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:18 AM
మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వ్యక్తికి నెల రోజులు జైలుశిక్ష విధిస్తూ న్యాయాధికారి తీ ర్పు ఇచ్చినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలి పారు.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వ్యక్తికి నెల రోజులు జైలుశిక్ష విధిస్తూ న్యాయాధికారి తీ ర్పు ఇచ్చినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. నగరంలోని గొడగల వీధికి చెందిన ముంజేటి రవిమోహన్ వాంబే కాలనీ రోడ్డులో పూటుగా మద్యం సేవించి మత్తులో వచ్చిపోయే వారిపై అసభ్యకరంగా ప్రవర్తించాడని స్థానికులు సమాచారం ఇచ్చారన్నారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తిని అదుపు లోకి తీసుకొని ఓపెన్ డ్రంక్ కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిని సెకండ్ క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టు న్యాయాధికారి శివరామకృష్ణ ఎదుట హాజరుపరచగా ఆయనకు నెల రోజులు సాధారణ జైలు శిక్ష విధించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు గాయాలు
శ్రీకాకుళం క్రైం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పాత శ్రీకాకుళం పొన్నాడ వంతెన సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సానాపతి లావణ్య గాయపడింది. వాంబే కాలనీకి చెందిన లావణ్య ఆటో కోసం ఎదురుచూస్తుండగా ఆర్‌అండ్‌బీ బంగ్లా రోడ్డు నుంచి పాత శ్రీకాకుళం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అందాల సాయినిఖిల్ ద్విచక్ర వాహనం తో వస్తూ ఆమెను బలంగా ఢీకొన్నాడు. వెంటనే లావణ్య రోడ్డుపై పడిపో వడంతో తలకు, చేతికి, మోకాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.