Share News

రాధాసాగరంలో వ్యక్తి గల్లంతు

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:02 AM

గోకర్ణపురం పంచాయతీ చిన్నహంస గ్రామానికి చెందిన లండ రామారావు (48) అనే వ్యక్తి ఒడిశా లోని లావణ్యకోట సమీ పంలో ఉన్నా రాధాసాగ రంలో గల్లంతైనట్టు భార్య భాగ్యలక్ష్మి తెలిపింది.

రాధాసాగరంలో వ్యక్తి గల్లంతు
రాధాసాగరంలో గాలిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రామారావు (ఫైల్‌)

మెళియాపుట్టి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): గోకర్ణపురం పంచాయతీ చిన్నహంస గ్రామానికి చెందిన లండ రామారావు (48) అనే వ్యక్తి ఒడిశా లోని లావణ్యకోట సమీ పంలో ఉన్నా రాధాసాగ రంలో గల్లంతైనట్టు భార్య భాగ్యలక్ష్మి తెలిపింది. కుటుంబ సభ్యులు, ఒడి శాలోని గారబంద పోలీ సులు తెలిపిన వివరాల మేరకు సోమవారం మధ్యాహ్నం చిన్నహంస గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రాధాసాగరం పరిసర ప్రాంతంలో పార్టీ చేసుకుందామని రామా రావును తీసుకెళ్లారు. చేపల పెంపకందారులు మేత వేయటానికి తెప్పను సాగరం పక్కన ఉంచారు. దీంతో ఇద్దరు యువకులతో పాటు రామరావు పార్టీ చేసుకున్న తరువాత బోటు షికారు చేశారు. బోటు తిరగబడడంతో రామారావు మునిగిపోయినట్టు చెబుతున్నారు. సోమవారం రాత్రి రామారావు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు గాలించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఇద్దరు యువకులను నీలదీయడంతో బోటు తిరగబడి రామారావు బురదలో కురుకుపోయినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు గారబంద పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం ఒడిశాలోని అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను తీసుకువచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. రోజంతా గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఒడిశాలో అధికంగా వర్షాలు పడుతుండంతో సాగరానికి నీరు పోటెత్తుతోంది. సాగరంలో పెద్దపెద్ద చెట్లు... పిచ్చి మొక్కలు ఉండడం వల్ల గాలింపునకు ఇబ్బంది ఎదురవుతున్నట్టు ఒ డిశా పోలీసులు చెబుతున్నారు. రామారావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 12:02 AM