Share News

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , Publish Date - May 02 , 2025 | 11:35 PM

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బలగలో చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పాత్రునివలస గ్రామానికి చెందిన రావాడ కోటే శ్వరరావు(50) శుక్రవారం ఉదయం ఆదివారంపేట సమీపంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

శ్రీకాకుళం రూరల్‌, మే 2(ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బలగలో చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పాత్రునివలస గ్రామానికి చెందిన రావాడ కోటే శ్వరరావు(50) శుక్రవారం ఉదయం ఆదివారంపేట సమీపంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. కోటేశ్వర రావు కు మద్యం తాగే అలవాటుతోపాటు ఫిట్స్‌ ఉంది. ఇతడు నగరంలోని మాటూ రు రామారావు షాపులో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. కొన్నేళ్ల కిందట ఇతడు భార్య నుంచి విడిపోయాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ ఘటనపై రూరల్‌ ఎస్‌ఐ కె.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కిందపడి ఒకరు..

జి.సిగడాం, మే 2(ఆంధ్రజ్యోతి): జి.సిగడాం-వాండ్రంగి రైల్వే లైన్‌ మధ్య శుక్రవారం రైలు కిందపడి బోనంగి భాస్కరరావు(43) మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు.. భాస్కరరావు ఎచ్చెర్లలోని ఎన్‌ఏసీఎల్‌ పరి శ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ చిలకపాలెంలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన భాస్కరరావు భార్య ఆదిలక్ష్మితో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమం లో గురువారం కూడా భార్యతో గొడవపడి పోలీస్‌ స్టేషన్‌కి వెళతానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. మృతుడికి భార్య ఆదిలక్ష్మితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

కిడ్నీ వ్యాధితో ఇంటర్‌ విద్యార్థి..

పొందూరు, మే 2(ఆంధ్రజ్యోతి): కేశవదాసుపురం (కేడీ పురం) గ్రామానికి చెందిన లింగాల కిశోర్‌(16) కిడ్నీవ్యాధితో బాధపడుతూ గురువారం రాత్రి విశాఖ కేజీహెచ్‌లో మృతిచెందాడు. ఎచ్చెర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న కిశోర్‌ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తల్లి దండ్రులు విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసు కువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల్లో రెండు కిడ్నీలు పూర్తిగా పాడైనట్టు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స అందించాలని సూ చించారు. పేద కుటుంబం కావడంతో కిశోర్‌ను విశాఖలోని కేజీహెచ్‌కు తర లించారు. రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో పరిస్థితి విషమించి మృతి చెందాడు. కిశోర్‌ దీర్ఘకాలంగా కంటిచూపు సమస్య తో బాధపడుతున్నా.. 10వ తరగతి వరకు లోలుగు జడ్పీ హైస్కూల్‌లో చది వాడు. కుమారుగా మృతితో తల్లిదండ్రులు సుజాత, రాజులు కన్నీరుమున్నీరయ్యారు. చలాకీగా తిరిగే కిశోర్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కిశోర్‌ మృతిపై లోలుగు పాఠశాల హెచ్‌ఎం సంజీవరావు, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

జలుమూరు (సారవకోట), మే 2(ఆంధ్రజ్యోతి): అవలింగి గ్రామానికి చెందిన కె.సుదర్శనరావు (45) శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. సుదర్శనరావు కరోనా నుంచి అనారోగ్యానికి గురై మనస్తాపంతో గతనెల 26న ఇంటిలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య సంతోషి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - May 02 , 2025 | 11:35 PM