Share News

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:54 PM

జాడ పంచాయతీ ముక్కుపేట గ్రామానికి చెందిన తాలాడ వెంకటరావు(40) ఆదివారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

జి.సిగడాం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): జాడ పంచాయతీ ముక్కుపేట గ్రామానికి చెందిన తాలాడ వెంకటరావు(40) ఆదివారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ వెంకటరావు గ్రామంలో ఒక రైతు పంట పొలంలో మరమ్మతుల నిమిత్తం విద్యుత్‌ స్తంభం ఎక్కే సమయంలో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటరావుకి భార్య ఉమామహేశ్వరి, ఇద్దరు కుమారులు ఉ న్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వై.మధుసూఽధనరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవ పంచనామా అనంతరం మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

మహిళపై కత్తితో దాడి.. కేసు నమోదు

కొత్తూరు, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): కడుము కాలనీకి చెందిన కిల్లారి మహాలక్ష్మిపై అదే గ్రామానికి చెందని బూరాడ సంజీవరావు శనివారం రాత్రి కత్తితో దాడి చేసి గాయపరిచారని ఆమె భర్త వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎండీ అమీర్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. ఇంటిలో ఊడ్జిన చెత్త ఇంటి ముంగిట వేసుకుంటుంటే తన ఇంటి ఎదురుగా ఉన్న సంజీవరావు ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. చికిత్సకు కొత్తూరు ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని టెక్కలి డీఎస్పీ, కొత్తూరు సీఐ సీహెచ్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ ఎండీ అమీర్‌ అలీ పరిశీలించారు.

Updated Date - Sep 07 , 2025 | 11:54 PM