Share News

పాము కాటుతో వ్యక్తి మృతి

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:27 AM

బసవ రాజుపేట గ్రామానికి చెంది న వాన అప్పలనాయు డు(38) గురువారం పాముకాటుకు గురై మృతిచెందాడు.

పాము కాటుతో వ్యక్తి మృతి

ఎల్‌ఎన్‌ పేట, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): బసవ రాజుపేట గ్రామానికి చెంది న వాన అప్పలనాయు డు(38) గురువారం పాముకాటుకు గురై మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలనాయుడు గ్రామ సమీప పొలంలో ఎరువువేస్తుండగా కాలుకు పా ముచుట్టుకొని కాటువేసింది. దీన్ని గుర్తించిన అప్పలనా యుడు కుటుంబసభ్యులకు చెప్పగా.. వెంటనే హిరమండ లంలోని సుబలయి పీహెచ్‌సీకి తీసుకువెళ్లి చికిత్స అందించారు. పరిస్థితి విష మంగా ఉండడంతో 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా అప్పలనాయు డుకి భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హైమావతి కేసు నమోదు చేశారు.

చికిత్స పొందుతూ మహిళ..

నరసన్నపేట, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): నడగాం పంచాయతీ శివరాంపురం గ్రామానికి చెందిన తోలాపి రమణమ్మ(50) పాముకాటుకు గురై శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. ఈ నెల 5వ తేదీన రమణమ్మ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కాలుపై పాము కాటువేసింది. వెంటనే నరసన్నపేట వంద పడకల ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఈనెల 6న శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరిలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందారు. రమణమ్మ భర్త సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా కుమార్తెకు వివాహం అయింది.

Updated Date - Sep 12 , 2025 | 12:27 AM