విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:47 AM
జగతి గ్రామ స మీపంలోని రోడ్డు మలుపులో విద్యుత్ స్తంభానికి ద్విచక్ర వాహనం ఢీకొని జి.శివాజీ(25) శనివారం రాత్రి మృతి చెందాడు.
మృతుడు విజయనగరం జిల్లా వాసి
కవిటి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): జగతి గ్రామ స మీపంలోని రోడ్డు మలుపులో విద్యుత్ స్తంభానికి ద్విచక్ర వాహనం ఢీకొని జి.శివాజీ(25) శనివారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా దత్తిరాజు మండలం పెద్దమానా పురానికి చెందిన జి.శివాజీ భారత్ గ్యాస్ కంపెనీలో విధులు నిర్వహిస్తుంటాడు. ఇతడు కొత్తపుట్టుగ, లండా రిపుట్టుగ పంచాయతీ పరిధిలోని గృహావసరాలకు వినియోగించే కనెక్షన్లను పరిశీలించి నివేదిక ఇస్తుంటాడని కవిటి ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే శనివారం రాత్రి తోటి సిబ్బంది వద్ద ద్విచక్ర వాహనం తీసుకుని కవిటి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని ఆదివారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై మృతుడి బాబాయి జి.చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ ఎ.ప్రకాశరావు తెలిపారు. మలుపు వద్ద బైక్ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
చెరువులో పడి ఒకరు..
పాతపట్నం నవంబరు 2(ఆంధ్రజ్యోతి): గంగువాడ పంచాయతీ గొల్లపేట గ్రామానికి చెందిన మెట్ట చిన్నారావు(59) అనేవ్యక్తి బి.గోపాలపురం సమీపంలోని కృష్ణసాగరం చెరువలో ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందినట్టు ఎస్‌ఐ కె.మధుసూధనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. చిన్నారావు సమీప బంధువు బి.గోపాలపురం గ్రామంలో మృతిచెందడంతో పరామర్శకి వెళ్లి తిరిగివస్తుండగా మార్గమధ్యలో గల కృష్ణసాగరం చెరువులో స్నానానికై దిగాడు. ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయి నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. చిన్నారావుకి భార్య చిన్నమ్ముడు, ఇద్దరు వివాహిత కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
నదిలో పడి యువకుడు..
పాతపట్నం/పర్లాకిమిడి, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): స్థానిక మహేంద్రతనయనదిలో ప్రమాద వశాత్తుపడి పర్లాకిమిడికి చెందిన కసిమికోట సాయితేజ్ మృతి చెందాడు. పోలీసులు, కుటుం బీకులు తెలిపిన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం, పర్లాకిమిడి పట్టణ భగాతివీధి కు చెందిన సాయితేజ ఆదివారం వేకువజామున కార్తీక ఏకాదశి పూజల్లో భాగంగా నదీస్నానం ఆచరించందుకు వెళ్లాడు. పాతపట్నంలోని నీలకం ఠేశ్వరుని ఆలయ సమీపంలోఉన్న మహేంద్రత నయ నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కొట్టు కుపోయాడు. సమీపంగా ఉన్న కొందమంది ఆ విద్యార్థిని బయటకి తీసి పర్లాకి మిడి ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. అప్పటికే సాయితేజ మృతి చెం దినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు పాతపట్నంలోని ఓప్రైవేటు విద్యాసంస్థ లో 10వతరగతి చదువుతున్నాడు. సాయితేజ్‌కి తల్లి ఇందుమతి, తండ్రి దుల్లభ, చెల్లి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.