Share News

చెరువులో పడి వ్యక్తి మృతి

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:11 AM

చిగిరికొత్తపల్లికి చెందిన గిడుతూరి అప్పారావు (59) చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది.

చెరువులో పడి వ్యక్తి మృతి

  • ఆలస్యంగా వెలుగులోకి..

లావేరు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): చిగిరికొత్తపల్లికి చెందిన గిడుతూరి అప్పారావు (59) చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అప్పారావుకు గత కొన్నేళ్లుగా మతిస్థిమితం లేక బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 1న అప్పారావు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి అతడి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. శని వారం చిగిరికొత్తపల్లి పక్కనే ఉన్న చెరువు సమీప పొలాల్లో రైతులు వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భరించలేని దుర్వాసన వస్తుం డడంతో వారంతా అటుగా వెళ్లి పరిశీలించారు. దీంతో అప్పారావు మృతదేహం ఆ చెరువులో తేలియాడుతూ ఉండడాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పో లీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అప్పారావుకి భార్య చిన్నమ్మడుతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరందరికీ వివాహాలయ్యాయి. కుమారుడు సూరప్పడు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

సారవకోట(జలుమూరు), డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): అలుదు గ్రామానికి చెందిన కొరాయి శంకరరావు (54) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శంకరరావు శుక్రవారం సాయంత్రం మద్యం తాగేందుకు తన భార్యను డబ్బులు అడిగారు. ఆమె లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తా పానికి గురైన శంకరరావు శుక్రవారం రాత్రి ఉరివేసుకున్నాడు. కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

రైలు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

పాతపట్నం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పాతపట్నం పరిధి కాకితోట సమీపంలో రైలు ఢీకొన్న ఘటనలో బొమ్మాళి సోమేశ్వరరావు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం చోటుచేసుకొంది. స్థానికులు తెలిపి న వివరాల మేరకు.. పట్టణ పరిధి రెల్లివీధికి చెందిన సోమేశ్వరరావు పట్టాలు దాటుతుం డగా గుణుపూర్‌ నుంచి పూరి వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ ఢీకొనడంతో ఎడమకాలు పా దం కట్‌ అయిపోగా, కుడిచేయికి విరిగిపో యాయి. గాయప డిన సోమేశ్వరరావును 108 సిబ్బంది స్థానిక సీహెచ్‌సీకి తరలించి ప్రాఽథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

Updated Date - Dec 07 , 2025 | 12:11 AM