Share News

చెరువులో పడి వ్యక్తి మృతి

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:15 AM

కూర్మనాథపురం గ్రామానికి చెందిన మొయ్యి దాలినాయుడు(40) చెరువులో పడి సోమవారం మృతిచెందాడు.

చెరువులో పడి వ్యక్తి మృతి

జలుమూరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): కూర్మనాథపురం గ్రామానికి చెందిన మొయ్యి దాలినాయుడు(40) చెరువులో పడి సోమవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రాత్రి భోజనం చేసిన తరువాత దాలినాయుడు బహిర్భూమికని పిల్లలనారయ్య కోనేరు వైపు వెళ్లాడు. ఎప్పటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెదికినా ఆచూకీ దొరకలేదు. సోమవారం తెల్లవారేసరికి అదె చెరువులో శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతిచెంది ఉంటాడని బావిస్తున్నారు. దాలినాయుడికి భార్య జగదీశ్వరి, కుమారుడు, తల్లి నారాయణమ్మ ఉన్నారు. జగదీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.ఆశోక్‌బాబు తెలిపారు.

అనారోగ్యంతో పోలాకి ఏఎస్‌ఐ..

పోలాకి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): గత మూడేళ్లుగా పోలాకి పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న ఆదినారాయణ అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఆదినారాయణ కొన్నాళ్లగా కాలికి సంబంధిత వ్యా ధి తో బాధపడుతున్నారు. దీని ప్రభావం కిడ్నీపై పడడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆదినారాయణ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడు. కాగా ఈయన మృతిపై సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రంజిత్‌తోపాటు రెవెన్యూ, మండల పరిషత్‌, వెలుగు సిబ్బంది సంతాపం వ్యక్తంచేశారు.

Updated Date - Sep 02 , 2025 | 12:15 AM