Share News

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - May 19 , 2025 | 11:48 PM

కోమర్తి గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి (31) మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కోమర్తి వద్ద మృతిచెందిన ఒడిశా వాసి, ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌

నరసన్నపేట, మే 19(ఆంధ్రజ్యోతి): కోమర్తి గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి (31) మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈప్రమాదంలో ఒడిశాకు చెందిన వ్యక్తి మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన ప్రాంతాన్ని ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - May 19 , 2025 | 11:48 PM