మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:30 AM
బప్పడాం గ్రామానికి చెందిన పేడాడ శ్రీధర్(41) గురువారం రా త్రి తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు.
సరుబుజ్జిలి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): బప్పడాం గ్రామానికి చెందిన పేడాడ శ్రీధర్(41) గురువారం రా త్రి తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వి వరాల మేరకు.. శ్రీధర్ కొన్నాళ్లగా వివిధ నేరాలో నింది తుడిగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నేర చరిత్ర కలిగిన వ్య క్తిగా గుర్తింపబడ్డాడు. ఇటీవల తన స్నేహితుడిపై కత్తి తో దాడి చేసిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. నేర చరిత్రలో తనతో పాటు తల్లికి సంఘంలో గౌరవం దక్కడం లేదని మనస్తాపం చెందిన శ్రీధర్ ఇం టిలోని వేరే గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన అతడి తల్లి పేడాడ మణమ్మ కేకలు వేయగా ఇరుగు పొరుగువారు వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శుక్రవారం శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకా కుళం రిమ్స్‌కు తరలించారు. శ్రీధర్ తల్లి మణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.