బావిలో పడి వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:06 AM
మేజర్‌పంచాయతీ టెక్కలిలోని అక్కపువీధికి చెందిన మోనింగి శ్రీనివాసరావు (40) బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
టెక్కలి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): మేజర్‌పంచాయతీ టెక్కలిలోని అక్కపువీధికి చెందిన మోనింగి శ్రీనివాసరావు (40) బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీనివాసరావు శుక్రవారం నుం చి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పరిసరాల్లో వెతికారు. కాగా శనివారం ఇంటికి సమీపంలోని బావిలో శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలు సుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. శ్రీనివాసరావుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.