భార్య ఫిర్యాదు చేసిందని వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:16 AM
భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవా రం నగరంలో చోటుచేసు కుంది.
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవా రం నగరంలో చోటుచేసు కుంది. శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సీమన్ ఉద్యోగం చేస్తున్న బర్రి నాగరాజు భార్య, ఇద్దరు పిల్లలతో గుజ రాతీపేట చెరువు గట్టు వీధిలో కొన్నేళ్లుగా నివసిస్తున్నాడు. అయితే నాగరాజు విధులు నిమిత్తం ఏడాదిలో తొమ్మిది నెలలు బయట ప్రాంతం లో ఉంటున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన నాగరాజు భార్యతో నిత్యమూ గొడవలు పడడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటి గదిలో ఫ్యాన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు తల్లి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.