లారీలతో నష్టం వచ్చి.. అప్పులపాలై.. వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:03 AM
ఇచ్ఛా పురం మున్సిపాల్టీ 17వ వార్డు సంతపేటకు చెందిన కర్రి నాగరాజు(46) ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛా పురం మున్సిపాల్టీ 17వ వార్డు సంతపేటకు చెందిన కర్రి నాగరాజు(46) ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్‌ఐ ముకుంద రావు తెలిపిన వివరాల మేరకు.. నాగరాజుకి 21 ఏళ్ల కిందట బెల్లుపడ కొండివీధికి చెందిన కృష్ణవేణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. మూడు లారీలతో ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేసుకునే వాడు. నాలుగేళ్ల కిందట రెండు లారీలు ప్ర మాదానికి గురై పాడయ్యాయి. ఉన్న ఒక్క లారీకి డ్రైవర్‌ను పెట్టు కుని నడిపేవాడు. ఇదే క్రమంలో జనసేన పార్టీలో కార్యకర్తగా తిరిగే వాడు. ఉన్న లారీతో కూడా సరైన వ్యాపారం లేకపోవడంతో విక్రయించాడు. అ యితే ఆర్థికం గా బాగా చితికిపోయి అప్పుల పాలయ్యాడు. ఈ మూడు లారీల కారణంగా సుమారు రూ.30 లక్షల వరకు అప్పులపాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త ఆర్థిక ఇబ్బందులను చూసిన భార్య కృష్ణవేణి తాను సభ్యురాలిగా ఉన్న డ్వాక్రా గ్రూపు నుంచి రూ.6 లక్షలు లోన్ తీసుకుంది. అయితే ఆ లోన్ సక్రమంగా తీర్చలేకపోవడంతో మనస్తాపం చెందిన నాగరాజు ఇంటిలోని మేడపై గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. నాగరాజు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పురుగుమందు తాగి ఒకరు..
జలుమూరు (సారవకోట), సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): నవతల గ్రామానికి చెందిన వాడారి అప్పన్న(49) శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసు కున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మద్యానికి అలవాటుపడిన అప్పన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అప్పన్న భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు. కాగా అప్పన్నకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.