గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:23 AM
కురిగాం గ్రామానికి చెందిన పడ్డాల బాలకృష్ణ(40) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు హెచ్‌సీ కోటేశ్వరావు తెలిపారు.
కొత్తూరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): కురిగాం గ్రామానికి చెందిన పడ్డాల బాలకృష్ణ(40) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు హెచ్‌సీ కోటేశ్వరావు తెలిపారు. తాపీమేస్త్రీగా పనిచేసుకుంటున్న బాలకృష్ణ మద్యానికి బానిసై నిత్య మూ భార్యతో తగాదా పడుతుండేవాడు. దీంతో అతడి భార్య తన పుట్టింటికి వెళ్లి పోయింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంటిలో ఉన్న గడ్డిమందును తాగి అపస్మారకస్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే కొత్తూరు ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యంకోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ తెలిపారు.