cheating on lover ప్రేమించి మోసగించిన వ్యక్తి అరెస్టు
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:17 AM
cheating on lover ప్రేమించి పెళ్లి చేసు కుంటానని నమ్మబలికి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు జేఆర్ పురం సీఐ ఎం.అవ తారం తెలి పారు.

జి.సిగడాం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్లి చేసు కుంటానని నమ్మబలికి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు జేఆర్ పురం సీఐ ఎం.అవ తారం తెలి పారు. దీనికి సంబంధించిన వివరా లను స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆయన వెల్లడించారు. మండలం లో ఓ గ్రామానికి చెందిన యువతి ఈనెల 19న ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి అదే గ్రామానికి చెందిన సిగటాపు కిరణ్‌ను అరెస్టు చేశారు. ఆ యువతి, కిరణ్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇప్పుడు వేరే అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విష యం తెలుసుకున్న ఆ యువతి అతడిని నిలదీసినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేసి అతడిని అరెస్టు చేసి పొందూరు కోర్టులో హాజరుపరచగా వచ్చే నెల 3వ తేదీ వరకు న్యాయాధికారి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ వై.మధుసూదనరావు, ఏఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.