Share News

arreste ఎంబీబీఎస్‌ పేరుతో మోసగించిన వ్యక్తి అరెస్ట్‌

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:59 PM

arreste కజకిస్తాన్‌లో ఓ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌లో చేర్పించి ఫీజులను యూనివర్సిటీకి చెల్లించ కుండా మోసం చేయడంతో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌కు చెందిన గంగా ధర్‌ హరీష్‌ను బుధవారం రెండో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

arreste  ఎంబీబీఎస్‌ పేరుతో మోసగించిన వ్యక్తి అరెస్ట్‌

శ్రీకాకుళంక్రైం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): కజకిస్తాన్‌లో ఓ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌లో చేర్పించి ఫీజులను యూనివర్సిటీకి చెల్లించ కుండా మోసం చేయడంతో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌కు చెందిన గంగా ధర్‌ హరీష్‌ను బుధవారం రెండో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్‌కు చెందిన గంగాధర్‌ హరీష్‌ ఎంబీబీఎస్‌లో చేర్పించి ఫీజులను యూనివర్సిటీకి చెల్లించకుండా మోసం చేశాడని శ్రీకాకుళానికి చెందిన అన్నెపు నానాజీ టూటౌన్‌ పోలీసుల కు 2024 ఆగస్టులో ఫిర్యాదు చేశాడు. గతేడాది జూలై 29న ఎస్పీ గ్రీవెన్స్‌లో గంగాధర్‌ హరీష్‌ ఏడుగురు విద్యార్థులను కజకిస్థాన్‌లో ఎంబీబీఎస్‌ చదివి స్తానని ఒక్కక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు వసూ లు చేసి పరారయ్యాడని బాధితులు ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు సమీపంలోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో టూటౌన్‌ సీఐ పి.ఈశ్వర రావు హరీ ష్‌ కోసం గాలించారు. దొరక్క పోవడంతో సీఐడీ ద్వారా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేశారు. ఢిల్లీ విమానశ్రయంలో శనివారం రాత్రి ఎయిర్‌ పోర్ట్‌ పోలీ సులకు గంగాధర్‌ హరీష్‌ పట్టుబడ్డాడు. నిందితుడిని తీహార్‌ జైలుకి తర లించి, శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడిని బుధవారం జిల్లాకు తీసుకొచ్చిన టూటౌన్‌ పోలీ సులు విచారణ అనంతరం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఫొటోగ్రాఫర్‌కు కేటుగాళ్ల టోకరా

హరిపురం ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): మందస పట్టణానికి చెందిన ఫొటో, వీడియోగ్రాఫర్‌ శ్రీనివాస్‌ పాడికి సైబర్‌ కేటుగాళ్లు ఫోన్‌ చేసి రూ.60వేలు దోచుకున్న ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి పాడికి ఫోన్‌ చేసి మేం పోలీసులమని, మందస ఎస్‌ఐకి అత్యవసరం గా రూ.60 వేలు అవసరమని చెప్పారు. నగదు సార్‌ వద్ద ఉందని, మీరు ఫోన్‌పే చేస్తే కానిస్టేబుల్‌ ద్వారా నగదు పంపిస్తామని నమ్మబలికారు. దీంతో శ్రీనివాస్‌పాడి సదరు నెంబరుకు రూ.60 వేలు ఫోన్‌పే చేసి ఫోన్‌ వచ్చిన నెంబరుకు విషయం చెప్పాడు. నగదు పంపించమని కోరాడు. ఐదు నిమిషాల్లో మీముందు నగదుతో ఉంటా మని సదరు వ్యక్తులు చెప్పారు. గంట గడిచినా వ్యక్తి రాకపోయేసరికి ఫోన్‌ చేయగా అప్పటికే ఆ నెంబరు స్విచ్ఛాప్‌ అయ్యింది. దీంతో పాడి లోబోది బోమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మందస పోలీ సులు దర్యాప్తు చేపడుతున్నారు.

మహిళపై దాడి

సోంపేట, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణ కొర్లాం గ్రామానికి చెందిన బంగారు దమయంతిపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దాడిచేసి బంగారు నగలు అపహరించారు. స్థానికులు, బారువ పోలీసుల కథనం మేరకు.. దమయంతి హుకుంపేటలో పాలు అమ్ముకుని ఇంటికి వెళ్తోంది. ఆసమయంలో గుర్తు తెలియని వ్యక్తి తలపై దాడిచేసి గాయపరి చాడు. చెవి, ముక్కుకు ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించాడు. విషయం తెలుసుకున్న సీఐ మంగరాజు, బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 10 , 2025 | 12:00 AM