Share News

Maleria: మలేరియా నివారణ.. మన బాధ్యత

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:11 AM

Malaria Prevention Public Health మలేరియా నివారణ మనందరి బాధ్యత అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.అనిత పిలుపునిచ్చారు. మలేరియా నివారణా మాసోత్సవాల సందర్భంగా స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద సోమవారం మలేరియా నివారణ అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు.

Maleria: మలేరియా నివారణ.. మన బాధ్యత
ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిత

  • డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.అనిత

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): మలేరియా నివారణ మనందరి బాధ్యత అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.అనిత పిలుపునిచ్చారు. మలేరియా నివారణా మాసోత్సవాల సందర్భంగా స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద సోమవారం మలేరియా నివారణ అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఏడురోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మలేరియా వ్యాధి.. దోమకాటు వలన వస్తుంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తాం. మలేరియా అంతం మనతోనే. కొత్తగా ఆలోచిద్దాం.. ఉత్తేజం పొందుదాం’ అని తెలిపారు. అనంతరం అందరితో మలేరియా నివారణా ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం డీఎంహెచ్‌వో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్‌ రాందాస్‌, డీపీఎంవో సత్యనారాయణ, డెమో వేంకటేశ్వరరావు, ఆశాలు, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 12:11 AM