Share News

బాలియాత్రను జయప్రదం చేయండి

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:06 AM

Today baliyatra ‘శ్రీముఖలింగేశ్వరాలయంలో ఆదివారం నిర్వహిం చనున్న బాలియాత్ర తెప్పోత్సవాన్ని విజయవం తం చేయాలి. అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు.

బాలియాత్రను జయప్రదం చేయండి
సూర్యతీర్థం రేవును పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే రమణమూర్తి తదితరులు

నేడు సూర్యతీర్థం రేవులో తెప్పోత్సవానికి అనుమతి

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

జలుమూరు, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘శ్రీముఖలింగేశ్వరాలయంలో ఆదివారం నిర్వహిం చనున్న బాలియాత్ర తెప్పోత్సవాన్ని విజయవం తం చేయాలి. అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, బాలియాత్ర కమిటీ సభ్యులతో కలిసి వంశధార నది తీరప్రాంతం, తీర్థఘట్టాల రేవులు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘శ్రీముఖలింగేశ్వరాలయం నుంచి వంశధార నదికి వెళ్లే మార్గంలో ఉన్న హంసతీర్థం రేవు లోతు హెచ్చుగా ఉన్నందున తెప్పలు విడిచిపెట్టేందుకు వీల్లేదు. పండా వీధి నుంచి వంశధార నదికి వెళ్లే మార్గంలో ఉన్న సూర్యతీర్థం రేవు తెప్పలు విడిచిపెట్టడానికి అనువుగా ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందు లు లేకుండా ఈ రేవు వద్దే తెప్పోత్సవానికి కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయాలి. సూర్య తీర్థానికి వెళ్లే మార్గాన్ని చదును చేయించి శుభ్రం చేయాలి. మార్గానికి ఇరువైపులా విద్యుత్‌ దీపా లు అలంకరించాలి. సీసీ కెమెరాలు అమర్చాలి. వంశధార నదికి వెళ్లే భక్తులకు, తిరిగి వచ్చే భక్తులకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలి. ఆలయ ప్రాంగణంలో పటిష్టమైన బారీకేడ్లు ఉండాలి. నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాల’ని ఆదేశించారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, కళింగ జేఏసీ కన్వీనర్‌ బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తర్ర బలరాం, అర్చకులు ఎస్‌.వి.చలం, శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష, తహసీల్దారు జె.రామారావు, డిప్యూటీ ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఎంపీటీసీ కె.హరిప్రసాద్‌, సర్పంచ్‌ టి.సతీష్‌కుమార్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 12:06 AM