Share News

యోగా డేని విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:13 PM

విశాఖపట్నంలో ఈ నెల 21న నిర్వ హించనున్న అంత ర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చే యాలని పెడన, మార్కాపురం ఎమ్మెల్యేలు కాగితాపు కృష్ణప్రసాద్‌, కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

యోగా డేని విజయవంతం చేయాలి
సమీక్షలో పాల్గొన్న పెడన, మార్కాపురం ఎమ్మెల్యేలు

  • పెడన, మార్కాపురం ఎమ్మెల్యేలు

ఆమదాలవలస, జూన్‌ 17(ఆంధ్రజ్యో తి): విశాఖపట్నంలో ఈ నెల 21న నిర్వ హించనున్న అంత ర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చే యాలని పెడన, మార్కాపురం ఎమ్మెల్యేలు కాగితాపు కృష్ణప్రసాద్‌, కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న యోగా డే ఆమదాలవలస నియోజకవర్గ పరిశీలకులుగా ప్రభు త్వం వారిని నియమించింది. దీంతో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌ క్యాంప్‌ కా ర్యాలయంలో నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్‌తో వారు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆసక్తి కనబరిచారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతా విద్యాసాగర్‌, టీడీపీ నాయకులు మొదలవలస రమేష్‌, తమ్మినేని సుజాత, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:13 PM