Share News

సమ్మెను జయప్రదం చేయండి

ABN , Publish Date - May 10 , 2025 | 11:49 PM

నాలుగు లేబర్‌కోడ్లు రద్దు చేయాలని, నూతన మార్కెట్‌ చట్టాన్ని రద్దు చేయాలన్న తదితర డిమాండ్లతో ఈ నెల 20న నిర్వహిం చనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక, ఉద్యోగ సంఘల నాయకులు కోరారు.

సమ్మెను జయప్రదం చేయండి
మాట్లాడుతున్న కార్మిక సంఘ నాయకులు

అరసవల్లి,మే 10(ఆంధ్రజ్యోతి): నాలుగు లేబర్‌కోడ్లు రద్దు చేయాలని, నూతన మార్కెట్‌ చట్టాన్ని రద్దు చేయాలన్న తదితర డిమాండ్లతో ఈ నెల 20న నిర్వహిం చనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక, ఉద్యోగ సంఘల నాయకులు కోరారు.శనివారం శ్రీకాకుళంలోని క్రాంతిభవన్‌లో సంయుక్త కిసాన్‌మోర్చా, రైతుల సంఘాల, ట్రేడ్‌ యూనియన్ల జిల్లాస్థాయి సమావేశం జరి గింది. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ తాండ్ర ప్రకాష్‌, ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చంద్రరావు, కె.మోహ నరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎఫ్‌టీయూనాయకులు కృష్ణవేణి,ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బి.సంతోష్‌ మాట్లాడారు. పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని, రైతుల, వ్యవసాయ కార్మికుల, రైతుల రుణాలు రద్దుచేయాలని, కౌలు రైతుల రక్ష ణకు సమగ్ర చట్టం రూపొందించాలని కోరారు.

Updated Date - May 10 , 2025 | 11:49 PM