భక్తులకోసం పక్కా ఏర్పాట్లు చేయండి
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:43 PM
దసరారోజున వాహనాల పూజల కోసం వచ్చే భక్తులకోసం పక్కా ఏర్పాట్లుచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. జిల్లాలోని అధికసంఖ్యలో వాహనాలు, దూరప్రాంతాల నుంచి భక్తులతాకిడి అధికంగా ఉండనుండడంతో పటిష్టమైన ఏర్పాట్లుచేయాలని దేవదా య,పోలీస్‌శాఖఅధికారులను ఆదేశించారు.
పాతపట్నం,సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి):దసరారోజున వాహనాల పూజల కోసం వచ్చే భక్తులకోసం పక్కా ఏర్పాట్లుచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. జిల్లాలోని అధికసంఖ్యలో వాహనాలు, దూరప్రాంతాల నుంచి భక్తులతాకిడి అధికంగా ఉండనుండడంతో పటిష్టమైన ఏర్పాట్లుచేయాలని దేవదా య,పోలీస్‌శాఖఅధికారులను ఆదేశించారు.మంగళవారం పాతపట్నంలోని నీలమణి దుర్గ ఆలయంలో దసరా నేపథ్యంలో అమ్మవారి పూజల నిర్వహణ, భక్తుల కోసం ఏర్పాట్లను పరిశీలించారు.ఆయన వెంటపైల బాబ్జీ, శివాల చిన్నయ్య, సైలాడ సతీష్, ఆలయ చైర్మన్ అక్కంద్ర సన్యాసిరావు, ఈవో వాసుదేవరావు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యేతామరలో చెవిటమ్మతల్లిని దర్శించుకున్నారు. ఇక్కడ జరిగిన కొమ్మలయాత్ర ఉత్సవం, యాటల కార్యక్రమంలో పాల్గొన్నారు.