నిర్వహణ లేక.. వినియోగంలోకి రాక
ABN , Publish Date - May 10 , 2025 | 11:50 PM
మండలంలోని చల్లవానిపేట పంచాయతీ పరిధిలోగల గుంజుమెట్ట వద్ద చెత్త సంపద తయారీ కేంద్రం నిర్వహణ లేకపోవ డంతో వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొంది.
జలుమూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చల్లవానిపేట పంచాయతీ పరిధిలోగల గుంజుమెట్ట వద్ద చెత్త సంపద తయారీ కేంద్రం నిర్వహణ లేకపోవ డంతో వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొంది. చెత్తను సంపద తయారీ కేంద్రానికి తరలించకుండా రోడ్డు పక్కనే చెత్తను వ్యాపారులు డంప్ చేస్తు న్నారు. చల్లవానిపేట కూడలిలోని వ్యాపారులు, హోటళ్లు, టిఫిన్ షాపుల నిర్వాహ కులు, చికెన్ విక్రయదారులు చెత్త, వ్యర్థాలు గుంజుమెట్టవద్ద గల చెత్తసంపద కేంద్రం ఎదురు, వెనుక భాగంలో పారబోస్తున్నారు. అడపాదడపా కురిసే వర్షాలకు చెత్త కుళ్లడంతో దుర్వాసన వెలువడుతోందని శ్రీముఖలింగం వెళ్లే ప్రయాణికులు, స్థానికులు వాపోతున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించి పంచాయతీలకు ఆదాయం సమకూర్చాల్సిఉంది. వచ్చే ఆదాయంతో గ్రామాలు అభివృద్ధికి ప్రభుత్వం వెచ్చించాలి. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల చెత్త సంపద కేంద్రాలు వినియోగంలోకి రాకపోవడంతో ప్రభుత్వం లక్ష్యం అటకెక్కుతోంది. ఇప్పటికైనా ప్రతిరోజూ చెత్తను తరలించి రోడ్డుపక్కనే పారబోస్తున్న వారికి నోటీసులు జారీచేసి కేసులు నమోదుచేసి రోడ్డుపక్కన చెత్త వేయకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని, చెత్త సంపద తయారీ కేంద్రం విని యోగం లోకి తీసుకు రావాలని పలువురు కోరు తున్నారు.