రహదారులకు మహర్దశ
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:10 AM
జిల్లాలోని రాష్ట్రీయ రహదారులకు మహర్దశ పట్టింది. తొమ్మిది రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.31.73 కోట్లు కేటాయించింది.
- జిల్లాలో స్టేట్ హైవేల అభివృద్ధికి రూ.31.73 కోట్లు
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
శ్రీకాకుళం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రాష్ట్రీయ రహదారులకు మహర్దశ పట్టింది. తొమ్మిది రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.31.73 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజాం-రణస్థలం రోడ్డు (స్టేట్ హైవే-122) 12 కిలోమీటర్లకు గాను రూ.4కోట్లు, మెళియాపుట్టి-పాతపట్నం రహదారి(ఎస్‌హెచ్-93) 12.6 కిలోమీటర్లకు రూ.3.40 కోట్లు, గార-చింతాడ రహదారి(ఎస్‌హెచ్-125) 2.4 కిలోమీటర్ల విస్తరణకు రూ.3.50 కోట్లు, సోంపేట-కవిటి-ఈదుపురం రహదారి(ఎస్‌హెచ్ - 81) 10.6 కి.మీ రూ. 4.10 కోట్లు, బద్రి-సారవకోట, తెంబూరు-హిరమండలం, జర్జంగి-పిండ్రువాడ రోడ్లు (ఎస్‌హెచ్-101, 106, 107)కు రూ.2.73 కోట్లు, నౌపడ-మెళియాపుట్టి రహదారి(ఎస్‌హెచ్-90) 13 కిలోమీటర్లకు రూ.6 కోట్లు, పొందూరు-సర్వేశ్వరపురం రోడ్డు ఆరు కి.మీ అభివృద్ధికి రూ.2.40 కోట్లు, తలతంపర-రామయ్యపట్నం రోడ్డు ఐదు కి.మీ పనులకు రూ.2.10 కోట్లు, గరుడభద్ర-బొడ్డపాడు, అక్కుపల్లి-తోటవూరు రహదారుల(ఎండీఆర్)అభివృద్ధికి రూ. 3.70 కోట్లు కేటాయించారు. మొత్తం 80 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.