Share News

18న కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:34 PM

ప్రభుత్వం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పేరుతో చేపడు తున్న బలవంతపు భూ సేకర ణకు వ్యతిరేకంగా ఈనెల 18న కలెక్టర్‌ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని, దీనిని విజయ వంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశరావు కోరారు.

18న కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా
ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నేతలు

సరుబుజ్జిలి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పేరుతో చేపడు తున్న బలవంతపు భూ సేకర ణకు వ్యతిరేకంగా ఈనెల 18న కలెక్టర్‌ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని, దీనిని విజయ వంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం వెన్నెలవలసలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్‌ కంపెనీ లకు కట్టబెట్టేందుకు పూనుకుంటోందన్నారు. అందులో భాగంగా అటు కార్గో ఎయిర్‌పోర్టు, ఇటు పవర్‌ ప్లాంట్‌ పేరుతో పెద్ద ఎత్తున భూములు ఆయా కంపెనీ లకు ధారాదత్తం చేసేందుకు సిద్ధపడుతోందని విమర్శించారు. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిం చాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షే మ పరిషత్‌ సంఘం అధ్యక్షుడు వాబ యోగి, రైతు కూలీ సంఘం అధ్యక్షుడు వంకల మాధవ రావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన్‌రావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కంట అప్పలనాయుడు, థర్మల్‌ వ్యతిరేక పోరాట కమిటీ నాయ కుడు అత్తులూరి రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 11:34 PM