Share News

పిచ్చికుక్క స్వైరవిహారం

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:53 PM

జర్జంగి పంచాయతీ గుం జిలోవ గ్రామం లో ఆదివారం వేకుమజామున పిచ్చికుక్క స్వైర విహారం చేసింది.

పిచ్చికుక్క  స్వైరవిహారం
ఆవుకు చికిత్స అందిస్తున్న పశువైద్యుడు కిరణ్‌కుమార్‌

  1. ఇద్దరి వ్యక్తులకు.. 16 పశువులకు గాయాలు

కోటబొమ్మాళి, జూలై 27(ఆంధ్ర జ్యోతి): జర్జంగి పంచాయతీ గుం జిలోవ గ్రామం లో ఆదివారం వేకుమజామున పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దీంతో ఇద్దరు వ్యక్తులతోపాటు తొమ్మిది ఆవులకు, నాలుగు ఎద్దులు, మూడు దూడలు గాయపడ్డాయి. ఇంటిముందు కట్టిన ఈ పశువులతోపాటు ఆరుబయట నిద్రిస్తున్న తర్లింగి బారికప్పయ్య, తిర్లింగి మోహనరావులపై పిచ్చికుక్క దాడి చేసింది గాయపడిన వీరిద్దరూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అలాగే గాయపడిన పశువులకు పశువైద్యాధికారి లఖినేని కిరణ్‌కుమార్‌ వైద్యం అందించారు.

Updated Date - Jul 27 , 2025 | 11:53 PM