అదుపు తప్పి.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:33 AM
మకరాంపురం కూడలి వద్ద బుధవారం ఓ కంటైనర్ బీభత్సం సృష్టించింది. ఆదివారం సంత సమీపంలో ట్రాక్టర్‌ను తప్పించబోయిన కంటైనర్ సంతలోకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది.
కంటైనర్ బీభత్సం
కంచిలి, జూలై 2(ఆంధ్రజ్యోతి): మకరాంపురం కూడలి వద్ద బుధవారం ఓ కంటైనర్ బీభత్సం సృష్టించింది. ఆదివారం సంత సమీపంలో ట్రాక్టర్‌ను తప్పించబోయిన కంటైనర్ సంతలోకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడం... పరిసరాలలో ప్రజలెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో చుట్టు పక్కల గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖాధికారులు..సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.