Share News

గోతులను పూడ్చిన లారీ యూనియన్‌ ప్రతినిధులు

ABN , Publish Date - May 28 , 2025 | 11:48 PM

కొత్తూరు ప్రభుత్వ వసతి గృహానికి ఎదురుగా రోడ్డు గోతులతో నిండి దారుణంగా తయారైంది. ఈ గొయ్యిలో ఓ దివ్యాంగుడు తన వాహనంతో పడి గాయాలబారిన పడ్డాడు.

 గోతులను పూడ్చిన లారీ యూనియన్‌ ప్రతినిధులు
అలికాం-బత్తిలి రోడ్డుపై క్రషర్‌ బుగ్గి వేసి చదును చూస్తున్న దృశ్యం

కొత్తూరు, మే 28(ఆంధ్రజ్యోతి): కొత్తూరు ప్రభుత్వ వసతి గృహానికి ఎదురుగా రోడ్డు గోతులతో నిండి దారుణంగా తయారైంది. ఈ గొయ్యిలో ఓ దివ్యాంగుడు తన వాహనంతో పడి గాయాలబారిన పడ్డాడు. దీంతో కొత్తూరుకు చెందిన నీలమణి దుర్గా లారీ యూనియన్‌ ప్రతినిధులు స్పం దించి సొంత నిధులు వెచ్చించి బుధవారం క్రషర్‌ బుగ్గితో గోతులను కప్పించారు. ఆరు నెలలుగా రోడ్డుపై గొయ్యి ఏర్పడగా గడచిన వారం రోజులుగా కురిసిన వర్షాలకు మరింత దారుణంగా తయారైంది. దీంతో ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని లారీ యూనియన్‌ ప్రతినిధులు స్పందించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 30 , 2025 | 03:05 PM