Share News

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:48 PM

జాతీయ రహదారి పలాస బైపాస్‌ రోడ్డు శాసనం జంక్షన్‌ వద్ద శనివారం మధ్యాహ్నం లారీ బోల్తా పడింది. అందులో ఉన్న డ్రైవర్‌, క్లీనర్లు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నా రు.

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో బోల్తా పడిన లారీ

పలాస, నవం బరు 15(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి పలాస బైపాస్‌ రోడ్డు శాసనం జంక్షన్‌ వద్ద శనివారం మధ్యాహ్నం లారీ బోల్తా పడింది. అందులో ఉన్న డ్రైవర్‌, క్లీనర్లు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇంటికి సమీపంలోనే ఈ ప్రమాదం జరగడం తో పోలీసులు అప్రమ్తమయ్యారు. సకాలంలో చేరుకొని ఆ లారీని అతికష్టంపై బయటకు తీశారు. జంషెడ్‌పూర్‌ నుంచి ఐరన్‌ ప్లేట్లతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వె ళ్తున్న క్రమంలో యు టర్నింగ్‌ వద్ద మరోలారీ వెళ్తుండడంతో దీన్ని తప్పించబో యి లారీ రోడ్డు పక్కన బోల్తా పడింది. ఘటన స్థలానికి కాశీబుగ్గ సీఐ పి.సూర్య నారాయణ చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్లైఓవర్‌ నుంచి దిగువకు వేగంతో వాహనాలు వస్తున్న క్రమంలో యు టర్నింగ్‌ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్ర మాదాలకు కారణంగా తెలుస్తున్నాయి.

Updated Date - Nov 15 , 2025 | 11:48 PM