Share News

లారీ బోల్తా.. త ప్పిన ప్రమాదం

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:58 PM

జాతీయ రహ దారి పాకివలస జంక్షన్‌ వద్ద బుధవారం సాయంత్రం లారీ బోల్తా పడి పక్కన ఉన్న సర్వీస్‌ రోడ్డులో పడింది.

లారీ బోల్తా.. త ప్పిన ప్రమాదం

కోటబొమ్మాళి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): జాతీయ రహ దారి పాకివలస జంక్షన్‌ వద్ద బుధవారం సాయంత్రం లారీ బోల్తా పడి పక్కన ఉన్న సర్వీస్‌ రోడ్డులో పడింది. విశాఖ నుంచి ఒడిశా వైపు ఇనుప రాయి ముడి సరుకుతో వెళ్తున్న 22 టైర్లు కలిగిన టెయిలర్‌ లారీ.. పాకివలస జంక్షన్‌కు వచ్చే సరికి డ్రైవర్‌ నిద్రలోకి జారుకోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఆ స మయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు వా పోతున్నారు. ఏడాది కిందట ఇక్కడే ఓ కారు అదుపుతప్పి పక్కన ఉన్న సర్వీస్‌ రోడ్డులో స్కూటీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలిపై పడింది. ఆ ఘటనలో ఆమె అ క్కడకక్కడే మృతి చెందింది. ఇప్పుడు లారీ కూడా అదే విధంగా పడడం.. ఆ స మయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ స్వల్ప గాయాల తో బయటపడ్డాడు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

Updated Date - Sep 10 , 2025 | 11:58 PM