లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:37 AM
మందస మండలం బాలిగాం జాతీయ రహదారిపై బుధవారం ఇచ్ఛాపురం వెళ్తున్న లారీ బోల్తా పడడంతో డ్రైవర్ రాజుకు, క్టీనర్ తీవ్రంగా గాయపడ్డారు.
హరిపురం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మందస మండలం బాలిగాం జాతీయ రహదారిపై బుధవారం ఇచ్ఛాపురం వెళ్తున్న లారీ బోల్తా పడడంతో డ్రైవర్ రాజుకు, క్టీనర్ తీవ్రంగా గాయపడ్డారు. బాలిగాం బ్రిడ్జి సమీపంలో ఒక లారీకి ఓవర్ టేక్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొనడంతో రోడ్డు పక్కన అమర్చిన సేఫ్టీ మెటల్ రెయిలింగ్‌ను ఢీకొట్టి సర్వీసు రోడ్డుపై బోల్తాపడింది. గాయపడిన వీరిద్దరి చికిత్స నిమిత్తం హరిపురం ప్రభు త్వాసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మందస ఎస్‌ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేశారు.