Share News

వ్యాన్‌ను ఢీకొన్న లారీ

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:13 AM

జాతీయ రహదారిపై నరసన్నపేట శివారున జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజస్తాన్‌ రాష్ట్రం భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన లారీ క్లీనర్‌ సల్మాన్‌ (19) మృతి చెందినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

వ్యాన్‌ను ఢీకొన్న లారీ
ప్రమాదానికి గురైన వ్యాన్‌, లారీ

  • ప్రమాదంలో క్లీనర్‌ మృతి

నరసన్నపేట, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై నరసన్నపేట శివారున జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజస్తాన్‌ రాష్ట్రం భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన లారీ క్లీనర్‌ సల్మాన్‌ (19) మృతి చెందినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. చెన్నై నుంచి బాలసూర్‌ వెళ్తున్న కార్గో లారీ.. ముందువెళ్తున్న వ్యాన్‌ను ఢీకొంది. దీంతో ముందువెళ్తున్న వ్యాన్‌ డివైడర్‌ పైకి వెళ్లి నిలిచిపోగా.. కార్గో లారీ ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో లారీ క్లీనర్‌ సల్మాన్‌ అక్కడక్కడే మృతిచెందారు. హైవే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు సాయంలో వాహనాలను పక్కకు నెట్టారు. మృతిడి కుటంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Jun 03 , 2025 | 12:13 AM