స్కూటీని ఢీకొన్న లారీ
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:57 PM
పట్ట ణంలోని ఇండస్ట్రీయల్ ఎస్టేట్ సమీపంలోని వంతెనపై శుక్రవారం స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో తల్లి మృ తి చెందగా కుమారుడికి గాయాలయ్యాయి.
తల్లి మృతి.. కుమారుడికి గాయాలు
ఆమదాలవలస, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పట్ట ణంలోని ఇండస్ట్రీయల్ ఎస్టేట్ సమీపంలోని వంతెనపై శుక్రవారం స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో తల్లి మృ తి చెందగా కుమారుడికి గాయాలయ్యాయి. స్థానిక పో లీసులు అందించిన వివరాల ప్రకారం.. బూర్జ మండ లం కొల్లివలస గ్రామానికి చెందిన సున్నగొప్పల మణికంఠ తన తల్లి భానుమతి తో కలిసి స్కూటీపై కొల్లివలస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తుండగా ఆమదాలవ లస ఫ్లైఓవర్‌పై శ్రీకాకుళం వైపునుంచి పాలకొండ వైపు కొబ్బరికాయల లోడుతో వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో భానుమతి అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠకు తీవ్రగాయాలయ్యాయి. ఆమదాలవలస పోలీసులు అక్కడకు చేరు కొని విచారణ చేయగా, ప్రమాదం జరిగిన స్థలం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో వారికి సమాచారం అందించారు. ఈ మేరకు రూ రల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్ వాసి మృతి
కవిటి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఆర్.కరాపాడు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పంచారామ్(28) అనే వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ వి.రవివర్మ వివరాల మేరకు.. స్థానిక టోల్‌గేట్ సమీపం లోనున్న రాజస్థాన్ దాబాలో పంచారామ్ పనిచేస్తు న్నాడు. గురువారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న పంచారామ్‌ను శిలగాం వైపు నుంచి రాంగ్‌రూట్‌లో వస్తున్న వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను 108వాహనంలో ఇచ్ఛాపురం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
నందిగాం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పాముకాటు కు గురైన బడగాం గ్రామానికి చెందిన బమ్మిడి వైకుంఠరావు(49) చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వైకుంఠరావు గత నెల 22న పొలంలో చేస్తుం డగా పాము కాటువేసింది. దీంతో అతడిని 108 వాహ నంలో చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం రిఫర్ చేయగా.. శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అయినా ఫలితం లేక పోయింది. వైకుంఠరావుకి భార్య, వివాహమైన కుమార్తె, డిగ్రీ చదువుతున్న కుమారుడు ఉన్నారు. కాగా ఈయన నిరుపేద కావడంతో గ్రామస్థులంతా ఆర్థిక సహాయం సుమారు లక్ష రూపాయలు సాయం అందించారు.