Share News

మద్యం షాపు సీజ్‌

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:05 AM

మండల కేంద్రంలోని పీఆర్‌ వైన్‌ షాపును బుధవారం ఆమదాలవలస ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ అధికారులు సీజ్‌ చేశారు.

మద్యం షాపు సీజ్‌
వైన్‌షాప్‌ను సీజ్‌ చేసిన ఎక్సైజ్‌ అధికారులు

- కల్తీ మందు విక్రయించడంతో అధికారుల చర్యలు

సరుబుజ్జిలి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పీఆర్‌ వైన్‌ షాపును బుధవారం ఆమదాలవలస ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ అధికారులు సీజ్‌ చేశారు. గత నెల 28న ఎక్సైజ్‌ అధికారులు ఈ దుకాణాన్ని తనిఖీ చేయగా 10.88 లీటర్ల కల్తీ మద్యం పట్టుబడింది. ఆ సమయంలో షాపులో విధులు నిర్వహిస్తున్న ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఆ మరుసటి రోజు నుంచే మళ్లీ ఆ మద్యం షాపును తెరిచి విక్రయాలు చేపట్టడంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆమదాలవలస ఎక్సైజ్‌ ఎస్‌ఐ కుమార్‌ తన సిబ్బందితో బుధవారం పీఆర్‌ వైన్‌ షాపు వద్దకు చేరుకొని మరోసారి షాపులో తనిఖీలు నిర్వహించారు. అనంతరం తలుపులు మూసివేసి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ఇటీవల నమోదైన కేసు నిమిత్తం షాపును తాత్కాలికంగా సీజ్‌ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అపరాధ రుసుం చెల్లించిన తర్వాత తిరిగి షాపును తెరుచుకోవచ్చునని అన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:05 AM