లిక్విడ్ ట్యాంకర్ బోల్తా
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:06 AM
: రాజాం- చిలకపాలెం ప్రధాన దారి వాండ్రంగి రైల్వే వంతెన సమీపం లో బుధవారం రాత్రి ఇథైల్ ఆల్కహాల్‌తో వెళుతున్న ట్యాంకర్ బోల్తా పడింది.
- తప్పిన పెను ప్రమాదం - డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
జి.సిగడాం, సెప్టెం బరు 25 (ఆంధ్రజ్యోతి): రాజాం- చిలకపాలెం ప్రధాన దారి వాండ్రంగి రైల్వే వంతెన సమీపం లో బుధవారం రాత్రి ఇథైల్ ఆల్కహాల్‌తో వెళుతున్న ట్యాంకర్ బోల్తా పడింది. ఒడిశా నుంచి కృష్ణలంక విమానాశ్రయానికి విత్తనాలకు సంబంధించిన లిక్విడ్ ను తరలిస్తున్న ట్యాంకర్ రాజాం- చిలకపాలెం రహదారి మీదుగా వస్తుండగా టైర్ పేలటంతో ఆదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. పెను తప్పడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆనందపురం- వాండ్రంగి రైల్వే వంతెన మధ్య బారీ మలుపు కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గురువారం జి.సిగడాం పోలీసులు, పొందూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్రేన్‌తో ట్యాంకర్‌ను బయటకు తీశారు. ఆ సమయంలో రాజాం- చిలకపాలెం రోడ్డులో గంటల కొదీ ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.