విద్యుదాఘాతంతో లైన్‌మన్ మృతి
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:02 AM
కిష్టుపురం గ్రామ సమీపంలో 33కేవీ విద్యుత్ లైన్‌కు తగిలిన చెట్టు కొమ్మలను తొలగించటానికి వ చ్చిన జూనియర్ లైన్‌మన్ మామిడి సురేష్(28) శు క్రవారం సాయంత్రం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.
కోటబొమ్మాళి/జలుమూరు, సెప్టెంబరు 12(ఆంధ్ర జ్యోతి): కిష్టుపురం గ్రామ సమీపంలో 33కేవీ విద్యుత్ లైన్‌కు తగిలిన చెట్టు కొమ్మలను తొలగించటానికి వ చ్చిన జూనియర్ లైన్‌మన్ మామిడి సురేష్(28) శు క్రవారం సాయంత్రం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జ లుమూరు మండలం పాగోడు గ్రామానికి చెందిన సురేష్ ఇదే మండలంలో టెక్కలిపాడు గ్రామ సచివా లయంలో జూనియర్ లైన్‌మన్‌గా విధులు నిర్వహి స్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా కిష్టుపురంలో సిబ్బందితో కలిసి టెక్కలి నుంచి చల్లవానిపేట వైపు వచ్చే 33 కేవీ విద్యుత్ లైన్‌కు తగులుతున్న చెట్ల కొమ్మలు తొలగించేందుకు వెళ్లాడు. సరఫరా నిలిపివేసి చేసి చెట్ల కొమ్మలు తొలగించారు. అనంతరం తిరిగి వెళ్లిపోతున్న సమయంలో ప క్కన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లకు కమ్మకత్తి తగలడంతో ప్రమాదానికి గురై అక డికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కోటబొమ్మాళి ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. కాగా సురేష్‌కి తల్లిదండ్రులు సరోజిని, రాజారావు, భార్య ఝాన్సీ, కుమార్తె వర్షిణి (4), కుమారుడు ఉజ్వల్ (16 నెలలు) ఉన్నారు. కుటుంబాన్ని పోషించే ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. వీదిన పడిందని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని సర్పంచ్ దామ మన్మఽథరావు కోరారు.