Share News

దీపావళికి ముందే ‘వెలుగు’లు

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:42 PM

No limit in three years term for VOAs గ్రామాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేయడంతోపాటు.. సంఘ రికార్డులను నిర్వహించే విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్ల(వీవోఏ)కు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడేళ్ల కాలపరిమితిని రద్దు చేసి.. ఎన్నికల హామీని నెరవేర్చింది. దీపావళికి ముందే వారి జీవితాల్లో వెలుగులు నింపింది.

దీపావళికి ముందే ‘వెలుగు’లు
పాతపట్నంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న ఎల్‌.ఎన్‌.పేట మండలం వీవోఏలు

  • వీవోఏల మూడేళ్ల కాలపరిమితి జీవో నిలుపుదల

  • ఎన్నికల హామీని నెరవేర్చిన ప్రభుత్వం

  • జిల్లాలో 1,297 మందికి లబ్ధి

  • సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలభిషేకాలు

  • నరసన్నపేట, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేయడంతోపాటు.. సంఘ రికార్డులను నిర్వహించే విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్ల(వీవోఏ)కు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడేళ్ల కాలపరిమితిని రద్దు చేసి.. ఎన్నికల హామీని నెరవేర్చింది. దీపావళికి ముందే వారి జీవితాల్లో వెలుగులు నింపింది. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ - వెలుగు పథకంలో వీవోఏలు ఎంతో కీలకం. గ్రామాల్లో పొదుపు పుస్తకాల నిర్వహణలో సంఘాల సభ్యులకు తోడ్పాటు అందించేందుకు సంఘప్రియ పేరుతో చేరి కొంతకాలం ఉచితంగా సేవలు అందించారు. వీరు నెలకోసారి ప్రతిపొదుపు సంఘంతో సమావేశం నిర్వహిస్తారు. గ్రామ, మండల సమాఖ్యల మధ్య వారధిగా పనిచేస్తారు. ఒక్కో గ్రామ సమాఖ్యకు ఒక్కో వీవోఏ బాధ్యత వహిస్తారు. గ్రామ సమాఖ్య పరిధిలో 30 నుంచి 50 వరకు పొదుపు సంఘాలు ఉంటాయి. ప్రస్తుతం గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులతో పొదుపు కట్టించుకోవడం నుంచి వారికి రుణాలు ఇప్పించడంలో రికార్డుల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. నెలకు సుమారు 15 రోజలపాటు విధులు నిర్వహించే వీవోఏలకు కూటమి ప్రభుత్వం మూడేళ్ల కాలపరిమితి రద్దు చేసి మరింత భరోసా కల్పించింది.

  • ఇదీ పరిస్థితి

  • జిల్లాలోని 30 మండలాల్లో 1,297 గ్రామ సమాఖ్యలకు ఒక్కో వీఏవో చొప్పున ఉన్నారు. వీరు మొదట పొదుపు పుస్తకాల నిర్వహణ చేసినందుకు ఆ సంఘం తరపున నెలకు రూ.50చొప్పున తీసుకునేవారు. తర్వాత ప్రభుత్వమే వారికి రూ.2వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేది. కొన్నాళ్ల తర్వాత దానిని రూ.3వేలకు పెంచింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గౌరవ వేతనం రూ.8వేలకు పెంచారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ సానుభూతి మహిళలను చేర్చుకునే ఉద్దేశంతో వీవోఏలకు మూడేళ్ల కాలపరిమితిని విధించింది. మూడేళ్ల కాలపరిమితి పూర్తయిన వీవోఏల స్థానంలో కొత్తవారిని నియమించేలా జీవో జారీచేసింది. దీంతో అప్పట్లో వీవోఏలు జిల్లావాప్తంగా పోరాటాలు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొన్నిచోట్ల వీవోఏలను తొలగించి తమ పార్టీ సానుభూతిపరులను నియమించింది. దీంతో వీవోఏలు మరింత ఆందోళన చెందారు. తాము అధికారంలోకి వస్తే వీవోఏల మూడేళ్ల కాలపరిమితిని తొలగిస్తామని ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీచేయడంతో వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చిత్రపటానికి పాలభిషేకాలు నిర్వహిస్తున్నారు.

  • సీఎం చంద్రబాబు రుణం తీర్చుకుంటాం

  • డ్వాక్రాసంఘాలను ఏర్పాటు చేసి.. గ్రామాల్లో వీవోఏలకు కొలువులు ఇచ్చారు. గతంలో గౌరవ వేతనం పెంచడమే కాకుండా.. తాజాగా మూడేళ్ల కాలపరిమితిని రద్దు చేసిన సీఎం చంద్రబాబునాయుడు రుణం తీర్చుకుంటాం. వీవోఏల బాధలను గుర్తించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

    - గంగు అరుణకుమారి, వీవోఏ సంఘ జిల్లా అధ్యక్షురాలు, ఎచ్చెర్ల

  • గ్రామాల్లో గౌరవం పెంచారు.

  • గ్రామ సమాఖ్యలో పొదుపు సంఘాల పుస్తకాలు నిర్వహణ చేసే వీవోఏలకు సీఎం చంద్రబాబునాయుడే గౌరవం పెంచారు. గౌరవవేతనం నిర్ణయించడమే కాకుండా వీవోఏ వ్యవస్థకు గుర్తింపు ఇచ్చారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మరింత ఉత్సహంతో పనిచేస్తాం.

  • - కోల భాగ్యలక్ష్మీ, వీవోఏ సంఘ జిల్లా కోశాధికారి, నరసన్నపేట

Updated Date - Oct 14 , 2025 | 11:42 PM